ఒక వ్యక్తి దేవుడి కోసం చాలా తపస్సు చేస్తే... అతని తపస్సుకు కరిగి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడు ఆ వ్యక్తి దేవునితో... నా విలువ ఎంత అని అడిగతే దేవుడు చిన్నగా నవ్వి... అతనికి ఒక రాయి చేతిలో పెట్టి, " దీని విలువ ఎంతో తెలుసుకుని రా, కాని దీనిని అమ్మ కూడదు" అని చప్పి పంపిస్తాడు. ఆ వ్యక్తి, ఒక పండ్ల వ్యాపారి దగ్గరకు వెళ్లి, రాయి చూపించి, ఈ రాయి విలువ ఎంత అని అడిగాడు 4 పండ్లు ఇస్తాను.. ఆ రాయి ఇస్తావా ..! అని అడుగుతాడు. కానీ దేవుడు దీని విలువ తెలుసుకోమన్నాడు అంతే.. కానీ అమ్మమనలేదు అనుకుని అక్కడి నుండి వెళ్లిపోయి.. ఒక కూరగాయల వ్యాపారి దగ్గరకు వెళ్లి, రాయి చూపించి, ఈ రాయి విలువ ఎంత అని అడిగాడు 10 కిలోల కూరగాయలు ఇస్తాను.. ఆ రాయి ఇస్తావా ..! అని అడుగుతాడు. కానీ దేవుడు దీని విలువ తెలుసుకోమన్నాడు అంతే.. కానీ అమ్మమనలేదు అనుకుని అక్కడి నుండి వెళ్లిపోయి.. ఒక బంగారు కొట్టు దగ్గరకు వెళ్లి, రాయి చూపించి, ఈ రాయి విలువ ఎంత అని అడిగాడు 50 లక్షలు ఇస్తాను.. ఆ రాయిని ఇస్తావా ..! అని అడుగుతాడు. కాన...