ఆత్మవిశ్వాసం Part -2



 అలా పాఠశాలకు వెళ్తూ.. ఉండగా ఒకరోజు వాల్ల నాన్న తనకు ఎదురు పడ్డాడు. చంద్రిక నవ్వుతూ నాన్న అని పలకరించింది కానీ వారసుడు పుట్ట లేదన్న బాధను చంద్రిక పై కోపంగా మార్చుకున్న నరేంద్ర ఎవరే నీకు నాన్న అని అరిచి వెల్లిపోయాడు పాపం... ఆ పసి హృదయం కల్లలో నిండ నీల్లు తెచ్చుకుని పాఠశాల వైపు అడుగుల వేసింది. అంతలో దూరం నుండి చంద్రికా... చంద్రిక అని దూరంగా ఒక పిలుపు, అది విన్న చంద్రిక వెనక్కి తిరిగి చూసింది. తనతోపాటు చదువుకునే పిల్లాడు తనవైపు పరిగెడుతూ వస్తున్నాడు, పేరు కారుణ్య, చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు.

   అప్పటి నుండి కారుణ్య వాల్ల మామయ్య దగ్గరే పెరుగుతున్నాడు.చంద్రిక మరియు కారుణ్య మంచి మిత్రులు చంద్రిక కారుణ్య ని చూసీ.. వాల్ల నాన్న అన్న మాటలు మరిచిపోయి కన్నీళ్లు తుడుచుకొని మెల్లిగా రా కారుణ్య అని అరుస్తుంది. 

 కారుణ్య వచ్చి ఏంటి! ఇవాల్ల నన్ను వదిలేసి ఒక్కదానివే వెల్తున్నావు అని అలకగా అంటాడు. అదేం లేదూ, నేను వచ్చాను కానీ నువ్వు బయటకు వెల్లావని చెప్పాడు మీ మామయ్య అని అనగా, అవును ఇవి తీసుకురావడానికే నీ కోసమే అని జేబులోంచి పచ్చి చింతకాయలు తీసిఇస్తాడు... కారుణ్య. అవి చూసీ చంద్రిక ఎంతో అనందపడుతుంది ఇద్దరు కలిసి పాఠశాలకు బయలుదేరుతారు... బడిలో తోటి విద్యార్థులు... గుసగుసలాడుతూ... రేయ్ చూడండ్రా జంట పక్షులు 🐦🐦 వచ్చాయి అని ఎగతాళి చేస్తూ నవ్వుతారూ ... 

కారుణ్య కోపంగా పైకి వెళ్తుంటే చంద్రిక ఆపీ తరగతి గదిలోకి తీసుకువెళుతుంది. మరుసటి రోజు... పాఠశాలలో అందరు పిక్నిక్ ప్లాన్ చేస్తారు చంద్రిక కారుణ్య కూడా మేము వస్తాము అని పేరు ఇస్తారు..... తరగతి ఉపాధయుడు, రేపు తెలవారు జామున బయలుదేరుదాం అందరు మీ మీ టిఫిన్స్ తెచ్చుకోండి వెల్లే దారిలో తినడనికిఅని చెప్పి వెల్లిపోతాడు.... అంతలో స్కూల్ చుట్టి గంట మోగుతుంది.... 


 Part - 3 కొనసాగుతుంది




  








Comments

Popular posts from this blog

Personality Development In Telugu

Value of Human Life ( జీవితం విలువ )