Personality Development In Telugu
పర్సనల్ డెవలప్ మెంట్ అంటే.. ఇప్పుడున్న కొందరు యువతీ, యువకులు…. ఏంటో..? ఎంత కష్టపడాలో… ఎంత కష్టపడి పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలో..? అలాగే.. Personality Development అంటే శరీరాన్ని పెంచుకుని six packs చేయాలి, అని అనుకునే వారు కూడా ఇప్పటికీ ఉన్నారు.
Personality Development అంటే ఏంటి మరీ..?
పర్సనాలిటీ డెవలప్ మెంటులో.. అంటే........
1. సామాజిక (Social)
2. భావోద్వేగం (Emotional)
3. మానసిక (Mental)
4. శారీరక (Physical)
5. ఆధ్యాత్మికం (Spiritual)
6. గుర్తింపు (Identity)
7. ఆకాంక్షలు / కలలు (Aspirations)
8. తెలివితేటలు (Talents)
9. జీవతంపై అవగాహన (Self Awareness)
10. పనిచేసే శక్తి (Potential) etc.
పైన తెలిపిన అన్ని విషయాలను కలిపితే.. అవగాహన చేసుకుంటే లేదా నేర్చుకుని తెలుసుకుంటే దానిని పర్సనాలిటీ డెవలప్ మెంట్ అంటారు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.. బరువులు, బస్తాలు మోయాల్సిన అవసరం లేదు... మీరు చేయాల్సింది కేవలం.. మీ మైండ్ కి పని చెప్పి నేర్చుకుని ఆచరనలో పెట్టడమే..
మీకు అర్థం అయ్యేలా వివరిస్తాను..
ఒకరోజు ఒక వ్యక్తి తన పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు, వచ్చే సరికి ఇంట్లో చిన్న గొడవ భార్య చెప్పింది వినలేదు.. కానీ తల్లి చెప్పిన మాటలు విని.. భార్యను కొట్టి పుట్టింటికి పంపించాడు. 10 రోజులు తల్లిదండ్రులతో కలిసి సంతోషంగానే ఉన్నాడు. తల్లి దండ్రుల మాటలు వింటుంటే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి తన భార్య పైన ఆలోచించుకున్నాడు, ఆలోచించుకుని ఒకరోజు భార్యదగ్గరికి వెళ్ళాడు. ఏమైంది అని అడిగాడు ఆ భర్త అప్పుడు తన భాదను మొత్తం పంచుకుంది. అప్పుడు అతనికి అర్ధమైంది ఏంటంటే... అత్తమామలు యజమానుల పోకట చూపించారని, తల్లిదండ్రులతో గొడవపడి వేరేగా వెళ్లి జీవనం కొనసాగిస్తున్నాడు.
పైన చెప్పింది అలా… కాకుండా మనం కొంచం ఆలోచించి ఇంకోలా చూద్దాం.
ఒకరోజు ఒక వ్యక్తి తన పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు, వచ్చే సరికి ఇంట్లో చిన్న గొడవ భార్య చెప్పింది వినలేదు.. అలాగే తల్లిచెప్పింది కూడా.. వినలేదు, ఎందుకంటే తన కళ్లతో స్వయంగా అక్కడ జరిగిన సంఘటన చూడలేదు.. చెవులతో వినలేదు.. కాబట్టి ఇద్దరి మాటలు వినకుండా, ఇటు తల్లికి నచ్చజెప్పి, అటుభార్యకు నచ్చజెప్పుకుని రోజువారి జీవితాన్ని కొనాగించడం ప్రారంభించాడు. తల్లిదండ్రులకు దూరం కాలేదు, భార్యాపైన చేయి పడలేదు. జీవితం అందరితో బంధువులతో చుట్టాలతో సంతోషంగా సాగిపోతుంది...!
వీడేంట్రా ఇలా కథలు చెప్తున్నాడు అనుకుంటున్నారేమో... నేను చెప్పేది నిజం అతడు మొదట తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టే, దూరం అయ్యాడు... అదే ఆలోచించి, తెలివిగా, సర్దిచెప్పుకున్నాడు కాబట్టే కుంటుంబంతో కలిసి ఉన్నాడు.... ఇది కేవలం మనం ఎలా వ్వవహరిస్తే ఒక పరిస్థితి మారుతుంది అని మాత్రమే నేను మీకు వివరించాను.. ఇక మీకు చెప్పిన ఆప్షన్ ఒక్కొక్కటిగా వివరిస్తాను చూడండి.
1. సామాజిక (Social)
సమాజం గురించి నువ్వు పూర్తిగా అవగాహన పొందు, అంటే ఒక వ్యక్తి ఒక్క వ్యక్తిత్వం నువ్వు తెలుసుకోవాలి. ఆ వ్యక్తి నిన్ను బాధపెట్టేలా మాట్లాడినా నువ్వు తిరిగి బాధపెట్టి, గొడవపడకుండా.. నీ మాటతోనే నవ్వుకుంటు సమాధానం చెప్పాలి. అంటే నువ్వు ఒక వ్యక్తి గురించి కానీ, వ్యవస్త గురించి కానీ మాట్లాడేటప్పుడు పూర్తిగా గమనించాలి సమాజాన్ని ఆ తర్వాతే మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వారికి మనపైన ప్రేమను పెంచేలా ఉండాలే.. కానీ పగ పెంచేలా కాదూ. నీ మాటలతో, ప్రవర్తనతో శత్రువుని కూడా మిత్రుడిగ మార్చుకునే స్వభావం, సామాజిక స్పృహా నువ్వు తెచ్చుకోవాలి.
2. భావోద్వేగం (Emotional)
ఒకవ్యక్తి చనిపోతే ఏడవడం అనేది సాధారణ విషయం, కానీ ప్రతి విషయానికి ఎమోషనల్ అవ్వడం సరి కాదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ప్రతి చిన్నవిషయానికి భావోద్వేగానికి గురి అవుతావో, అది నీ జీవితాన్ని క్షీణింప చేస్తుంది. ఒకవ్యక్తి మనకు దూరం అయ్యి 1 నెల అవుతుంది. అయిన కూడా అదే తలుచుకుంటు గదిలో ఒక మూలకు కూర్చోవడం కరెక్ట్ కాదు అని చెప్తాను నన్ను అడిగితే.. భావోద్వేగాలను పక్కన పెట్టి నువ్వు ఎప్పుడైతే ముందడుగు వేస్తావో నీ జీవితం బాగుపడుతుంది. నేను పూర్తిగా ఎమోషన్స్ లేకుండా బ్రతకాలి అని చెప్పటం లేదు, హద్దు ఉండాలి అని మాత్రమే అంటున్నాను.
3. మానసిక (Mental)
అయ్యో...! నా ప్రియుడు / ప్రియురాలు నన్ను వదిలేసి పోయింది, అని మూలకు కూర్చుని ఏడ్చి.. ఏడ్చీ.. మానసికంగా బాధపడుతూ చివరికి .. నీళ్లు లేని బావి కోసం, రైలు రాని పట్టాలపైన, పదును లేని కత్తులతో .. నాకు ఇందులో నవ్వొచ్చే విషయమేంటో చెప్పనా.. వదిలిసేంది అంటే అది తిరి రాదు అని అర్థం, లేదు నీతో ఆ వ్యక్తి అవసరం తీరిపోయింది అని అర్థం. ఆ విషయం తెలిసిన కొందరు ప్రేమ పిచ్చోల్లు బాత్రూంలకు పోయి.. వాడి పాడేసిన బ్లేడ్ తీసుకుని కోసుకోవాలా వద్దా .. కోసుకోవాలా వద్దా.. కోసుకున్నాకా ఫోటోలు తీసి Social Media లల్లో " I am Dieing, Don't Search for my body, Hey, My blood looks pure red" అని స్టేటస్లు ఒకటి. అది చూసి నీ లవర్ వస్తది, హమ్మయ్య! పీడా పోయింది, ఇప్పుడు హాపీగా ఉండొచ్చు, అని అనుకుంటారు. అందరు బాగానే ఉంటారు, పోయేది మాత్రం నీ ప్రాణం, మిగిలేది నీ తల్లిదండ్రులకు కడుపు శోకం.. అంతే.. ఇంకేం ఉండదు.
కాబట్టి మన మనస్సు, ఆలోచనలు కలుపుకుని ఏదైనా కోల్పోయిన, నష్టం వచ్చిన, ఇంట్లో కానీ భయటకానీ, ఏమైన గొడవలు అయినా.. అన్ని పక్కన పెట్టి మానసికంగా గట్టిగ ఉండాలి. అంతే..
4. శారీరక (Physically)
శారీరకంగా అంటే మీరేం Six Packs చేయాల్సిన పని లేదు. కేవలం మంచిగా తిని, ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా మరియు బద్దకం లేకుండా ఉంటూ.. Active గా ఉండడమే..
5. అధ్యాత్మిక (Spiritual)
ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండటం అంటే మీ పట్ల మరియు ఇతరుల పట్ల ప్రేమగా ఉండటమే. అత్యధిక ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా జీవించడం. ఆధ్యాత్మిక వ్యక్తి ప్రజలను, జంతువులు మరియు గ్రహలను గురించి కూడ పట్టించుకుంటారు. మతాన్ని ఆచరించి, ఇతర మతాలను గౌరవించే వ్యక్తులు, ధ్యానం చేసే వారు, ప్రార్థన చేసేవారు చాలా మంది ఆధ్యాత్మిక వ్యక్తులే. జంతువులని గౌరవించు, దేవున్ని పూజించు, మనసును ధ్యానించు.
6. గుర్తింపు (Identity)
పైన చెప్పినవి అన్ని పాటిస్తే, గుర్తింపు అదే వస్తుంది. అంటే నీకంటు ఒక పని కానీ, మాట మర్యాద కానీ మనం గుర్తింపుని ఇచ్చే.. అది కూడా మంచి గుర్తింపు, చెడుగా కాదు సుమా..!
7. ఆకాంక్షలు (Aspirations)
ఇప్పటి వరకు నీకు ఒక గమ్యం, కోరిక, కల లేకుండా ఉండొచ్చు కానీ.. ఇప్పటి నుండి నీకంటు ఒక కల(Goal) అనేది పెట్టుకో, ఎప్పుడైతే నువ్వు నీ గమ్యం కోసం పని చేస్తావో అప్పుడే నీలో మార్పులు కానీ, అనుభవాలు ఇలా ఇంకెన్నో నీకు ఎదురౌతాయి, నేర్చుకుంటావు. అప్పుడే పైకి ఎదుగ గలవు.. అనుకున్నది సాధించగలవు మిత్రమా
8. తెలివితేటలు (Talent)
దీనికి విద్య, పెద్ద పెద్ద డిగ్రీలతో సర్టిఫికేట్స్ ఉంటాల్సిన పనిలేదు. కేవలం తెలివితేటలు అనేవి నీకు ఉండాలి. బ్రతికే సామర్థ్యం ఉండాలి. ఏ పని చేయాలన్న సిగ్గు అనేది పడొద్దు, నువ్వు అడుక్కు తినట్లేదు సపాయి పని చేసిన, మోరీలు / నాలాల పూడికలు తీసిన, కంప్యూటర్ ముందు కూర్చున్న, రిక్షా నడుపుతున్న ఏదేమి చేసిన నువ్వు కష్టపడుతున్నావు తెలివిగా చేసుకుని సంపాదించుకుంటున్నావు. ఒక పని చేస్తున్నా కదా అని, దాని పైనే ఉండకు దానితో పాటు కాలీ సమయంలో ఇంకో పని చేసుకో అది తెలివి అంటే. ఏది చేసిన తెలివిగా, కొద్ది సేపు లేదా ఒకరోజు ఆలోచించి చేయి.
9. జీవితం పై అవగాహన ( Self Awareness)
నీ జీవితం నీ చేతిలోనే ఉంటుంది, నువ్వు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం పైన ఆధారపడుతుంది. నీతో పాటు నీ భార్యా, పిల్లల జీవితాలు కూడా నీ నిర్ణయాలపైననే ఆధారపడి ఉంటుంది. నీ పైన నీకు నమ్మకం లేనప్పుడు ఆ పని చేయకు నీకు దేని పైన గట్టి నమ్మకం ఉంటుందో నేను ఇది చేయగలను అన్న ధైర్యం దేని పైన ఉంటుందో అదే పని చేయి, ఒక నెల ఎదురు దెబ్బలు తాకొచ్చు కాని విజయం వస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో.. ఎప్పుడైతే నీపైన నీకు నమ్మకం కల్గుతుందో.. అప్పుడే నువ్వు జీవత స్వాతంత్ర్యం పొందగలవు. నిన్ని నువ్వు నమ్ము, నేను ఏదైనా చేయగలను అని నమ్ము, పక్కవాడు నీ వల్ల కాదు అంటే బాధపడకు, నా వల్ల ఎందుకు కాదు, ఆ పని ఎలా చేయాలి అని నేర్చుకుని నీకు నువ్వు జీవితం పైన నమ్మకం పెంచుకో అంతే.. " చేయలేవు అన్నదాన్నే చేసి చూపించాలి".
10. పనిచేసే శక్తి (Potential)
అవును.. నీకు శక్తి ఉండాలి, ఉండాలంటే ఆరోగ్యం మంచిగుండాలి, మంచిగ తినాలి దానితోపాటు.. నీకు పని చేయాలన్న ఆలోచన ఉండాలి. పని చేసే శక్తి, అంటే నువ్వు ఎలాంటి పని చేయడానికైనా, సిద్ధంగా ఉండాలి. నువ్వు చేసే ఏ పని అయి సరే నీకు డబ్బును సంపాదించి పెడుతుంది, కానీ బికారిని చేయదు. పని చేయడానికి సిద్ధంగా ఉండు అది ఏ పని అయినా సరే.. ఒక్కొక్క పని చేసుకుంటూ పోతేనే.. నీకు విలువలు అలాగే పని ప్రాధాన్యతలు తెలుస్తాయి. ఏ.. నేను ఈ పని చేయాలా..! నా కోసం రెడ్ కార్పెట్ పరిచి... AC రూం లో కూర్చోబెట్టి నెలకు లక్ష రూపాయల జీతం ఇస్తారు, అని అనుకుంటే నేనేం చేయలేను మీ కర్మ అని తప్ప.
కానీ ఒక్కటి చెప్పగలను డబ్బు వచ్చే పని అది ఏదైనా సరే .. ఒకడు మనల్ని చీప్ గా చూస్తాడేమో నా ప్రెస్టేజీ పడిపోతదేమో అని అనికోకు మిత్రమా..! ప్రతి పనికి ఒక విలువ అనేది ఉంటుంది. నువ్వు చెత్తబండి నడిపే వాడ్ని చులకనగా చూస్తావా.. కానీ అతను అదే చెత్తలో నెలకు Rs 15,000/- నుండి Rs 30,000/- జీతం తీసుకుంటున్నారు. నిన్ను వాడు చూడాలి చులకనగా.. ఎందుకంటే వాడు కనీసం చెత్త ఏరైనా సంపాదిస్తున్నాడు. కానీ నువ్వు వాన్ని చూసి హేలన చేస్తున్నావు.. ఒక్క రూపాయి సంపద లేకుండా..
అందుకే అంటున్నా... దేని విలువలు దానివే.. ఏ పనిలో వచ్చే సంపద, ఆ పనిలో వస్తుంది, కాబట్టి ఒక్కడు చులకనగా చూస్తాడనో, నీవు దిగజారుతావనో ఆలోచించకు, నేను పైకి రావాలి అని ఆలోచించి పనిచేసుకో..
వాడు చెడిపోయింది కాకుండా.. మనల్ని కూడా చెడదొబ్బే సమాజం తయారౌతుంది, జాగ్రత్త. నీ ఆలోచనలతో కాకుండా పక్కోడు ఏమనుకుంటాడో, అని అనుకుంటే మాత్రం పైకి రాలేవు, సంపాదించలేవు.
వాడు చెడిపోయింది కాకుండా.. మనల్ని కూడా చెడదొబ్బే సమాజం తయారౌతుంది, జాగ్రత్త. నీ ఆలోచనలతో కాకుండా పక్కోడు ఏమనుకుంటాడో, అని అనుకుంటే మాత్రం పైకి రాలేవు, సంపాదించలేవు.
పైన చెప్పిన 10 సూత్రాలను కేవలం మీరు ఒక నెల రోజులు పాటించండి, మీలో మార్పు మీకే తెలుస్తుంది. (నా ఈ మాటలు 10 మందికి ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే మాత్రం, ఖచ్చితంగా షేర్ చేయండి. ధన్యవాదాలు.).
Comments
Post a Comment