ఆత్మవిశ్వాసం Part - 1 ( జననం)
పాల వంటి తెలుపుతో, పాల రాతి కన్న నునుపైన రూపంలో ఉన్న మంచు ❄ మెరుస్తుండగా.. మంచు కొండల మధ్యల నుండి... ఎంతో అందంగా... సూర్యుడు ఉదయిస్తున్నాడు... ఆ సూర్యుని పొద్దుకు పచ్చని పంట పొలాలను చీరగా కట్టుకుని ఉందా...! అని అనిపించేలా ఉన్నా ఒక అందమైన గ్రామం, ఆ గ్రామంలో ప్రేమానురాగాలు పంచే మనుషులతో పాటు కోపాలు, ద్వేషాలు మరియు స్వార్థాలతో కూడిన ఎంతో మంది ఉన్నారు. అలాంటి అందమైన గ్రామంలో ఒక మూర్ఖుడు, రాక్షసుడైన నరేంద్ర అనే వ్యక్తికి ఒక అందమైన ఆడపిల్ల జన్మించింది.. కానీ... నరేంద్ర కు... మగ పిల్లాడు కావాలని ఉన్నాడు ఆడపిల్ల పుట్టే సరికి, కోపంతో...పచ్చి బాలింత అని కూడా చూడకుండా... తన భార్య అయిన రాజ్యలక్ష్మి ని, మగపిల్లాన్ని ఇవ్వమంటే... ఆడ దాన్ని కంటావా...! అని బలంగా చెంపలపై నుండి కొట్టి వెళ్లిపోయాడు... కానీ రాజ్యలక్ష్మి, తన కన్నీళ్లను తుడుచుకొని తనకు పుట్టిన పాపను చూసుకుని ఎంతగానో సంతోషపడింది... ఆ పాప మొహం అందమైన చంద్రబింబం లాగా మెరిసిపోతుంది. తామరలాంటి కళ్లతో చూస్తుంటే ముద్దొచ్చేలాగా ఉంది... పాపపుట్టుకతోనే ఒక దేవకన్య లాగా ఉంది. అందరు చూసి ఎంతగానో ఆనందపడ్డారు. ఆ...